చింత చిగురు - 2 కప్పులు
పెసరు పప్పు - 4 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒకటిన్నర చెంచా
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - ఒకటి
అల్లంవెల్లుల్లి - ఒక చెంచా
జీలకర్ర - అర చెంచా
నూనే - 2 చెంచాలు
పసుపు - కొద్దిగా
కొతిమీర - అర కప్పు
పుదీనా - పావు కప్పు
గరం మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా
తాలింపుకు కావలసిన పదార్థాలు :
నూనే - కొద్దిగా
కరివేపాకు - 4 రెమ్మలు
పచ్చి మిర్చి - 2 (పొడువుగా చిల్చినవి )
ఆవాలు - కొద్దిగా
మెంతులు - 4
చింత చిగురు ఎంచుకోవడం :
చింత చిగురు లేతగా , పుల్లగా ఉండే విధంగా చూసుకోవాలి . దీనిలో పురుగులు లేకుండా చూసుకొని రెండు సార్లు మంచి నీటితో కడిగి పక్కన ఉంచుకోవాలి .
తయారు చేసే విధానం :
1) మొదటగా పెసరు పప్పు కడిగి కనీసం 10 నిముషాలు నానబెట్టాలి
2) ఒక కడాయిలో నూనే వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వరకు మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి
3) ఇప్పుడు చింత చిగురు వేసి పచ్చి వాసన పోయాక కారం , ఉప్పు , పసుపు వేసి బాగా కలపాలి .
4) పెసరు పప్పు వేసి , కొతిమీర పొడి ,పుదీనా , ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి
5) ఇప్పుడు గరం మసాల , కొతిమీర వేసి, బాగా కలిపి దించుకోవాలి .
తాలింపు :
ఒక చిన్న గిన్నెలో నూనే వేడి చేసి , ఆవాలు , మెంతులు ,జీలకర్ర ,పచ్చి మిర్చి వేసి సగం వరకు మగ్గనివ్వాలి . కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని తాయారు చేసుకున్న పప్పు పైన వేసుకుని వడ్డించుకోవాలి .
దీనిని అన్నం , రొట్టెలతో తినవచ్చు