Saturday 9 February 2013

నాటు కోడి కూర (పులుసు )



కావలసిన పదార్థాలు :

నాటు  కోడి మాంసం - ఒక కిలో
ఉల్లిపాయలు - 200 గ్రాములు (4)
గసగసాలు- 25 గ్రాములు
కొబ్బరి తురుము - 50 గ్రాములు
పసుపు- కొద్దిగా
కారం  పొడి - ఒక చెంచ (సరిపడా )
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి మిరపకాయలు- 6-8
అల్లంవెల్లుల్లి - ఒక చెంచ
ధనియాల పొడి - ఒక చెంచ
కొతిమిర - అర కప్పు
పుదినా - కొద్దిగా(optional )
పెరుగు - అర కప్పు
కరివేపాకు- 2 రెబ్బలు (10-15 ఆకులు )
నూనే  - 3-5 చెంచాలు

1) మొదటగా కోడి మాంసం, సగం ఉప్పు, అల్లంవెల్లుల్లి, పసుపు, కారం , ధనియాల పొడి, పెరుగు కలిపి పక్కన ఉంచాలి . కనీసం 10-15 నిముషాలు నానబెట్టాలి
2) 100 గ్రాముల ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు సన్నగా తురుము కోవాలి.
3) గసగసాలు మరియు కొబ్బరి , మిగిలిన ఉల్లిపాయలు మెత్తగా వేరు వేరుగా రుబ్బుకోవాలి .
4) కడాయి లో  నూనే  వేడి చేసి,  పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు , కొద్దిగా  ఉప్పు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
5)తర్వాత ఉల్లిపాయ ముద్ద  వేసి మరో 5 నిముషాలు బాగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేయాలి
6) ఇప్పుడు కలిపి ఉంచిన మిశ్రమం వేసి ఒక 5 నిముషాలు కలపాలి
7) గసగసాలు - కొబ్బరి మిశ్రమ వేసి తగినన్ని నీళ్ళు  పోసి మూత  పెట్టాలి
8) కాసేపు తరవాత ఉప్పు సరి చూసుకుని , పుదినా, కొతిమిర వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి .

అంతే ఎంతో రుచికరమైన నాటు  కోడి మాసం తయారైంది .

Tuesday 28 August 2012

ఆలుగడ్డ పచ్చి బటానీల కూర

కావలసిన పదార్థాలు :


ఆలుగడ్డలు - 500 గ్రాములు 
పచ్చి బటానీలు  - 200 గ్రాములు 
టమాటాలు - 3 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం  - 2 చెంచాలు 
మసాల - 2 చెంచాలు 
పుదీనా - కొద్దిగా 
కొతిమీర - అర కప్పు 
నూనే  - 2 చెంచాలు 
తరిగిన ఉల్లిపాయలు - 2 
అల్లంవెల్లుల్లి - ఒక చెంచా 
పసుపు - కొద్దిగా 
ఆవాలు- కొద్దిగా 
జీలకర్ర - అర చెంచా 


తాయారు చేసే విధానం :

1) మొదటగా ఆలుగడ్డలు కడిగి 15 నిముషాలు ఉడుకనివ్వాలి , తరవాత తొక్క తీసి కావలసిన మాదిరిగా తరుముకోవాలి 
2) టమాటాలు , ఉల్లిపాయలు , కొతిమీర , పుదీనా  తరగాలి . బటానీలు ఒక గిన్నెలో  నానబెట్టాలి 
3) ఒక గిన్నెలో నునే వేడి చేసి ఆవాలు వేయాలి . తరవాత జీలకర్ర , ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి 
4) అల్లంవెల్లుల్లి వేసి పచ్చి  వాసన  పోయేదాకా వేగనివ్వాలి 
5) ఇప్పుడు బటానీలు వేసి కాసేపు ఉడికించుకోవాలి  ఆలు , టమాటాలు వేసి బాగా కలపాలి 
6) ఉప్పు , కారం , పసుపు పుదినా వేసి ఉడుకనివ్వాలి 
7) ఇదంతా బాగా ఉడికాక కొతిమీర , మసాల వేసి బాగా కలిపి దించుకోవాలి 

దీనిని రోటి , అన్నంతో , నాన్ తో తింటే చాల రుచిగా ఉంటుంది 

Sunday 29 July 2012

చింత చిగురు పప్పు


కావలసిన పదార్థాలు :

చింత చిగురు  - 2 కప్పులు
పెసరు పప్పు - 4 కప్పులు 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - ఒకటిన్నర చెంచా 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - ఒకటి
అల్లంవెల్లుల్లి  - ఒక చెంచా 
జీలకర్ర  - అర చెంచా 
నూనే - 2 చెంచాలు
పసుపు - కొద్దిగా
కొతిమీర - అర కప్పు
పుదీనా - పావు కప్పు
గరం మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా

తాలింపుకు కావలసిన పదార్థాలు :

నూనే  - కొద్దిగా
కరివేపాకు - 4 రెమ్మలు
పచ్చి మిర్చి - 2 (పొడువుగా చిల్చినవి )
ఆవాలు - కొద్దిగా
మెంతులు - 4


చింత చిగురు ఎంచుకోవడం :


చింత చిగురు లేతగా , పుల్లగా ఉండే విధంగా చూసుకోవాలి . దీనిలో పురుగులు లేకుండా చూసుకొని రెండు సార్లు మంచి నీటితో కడిగి పక్కన ఉంచుకోవాలి .





తయారు చేసే విధానం :

1) మొదటగా పెసరు పప్పు  కడిగి కనీసం 10 నిముషాలు  నానబెట్టాలి
2) ఒక కడాయిలో నూనే వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వరకు మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి
3) ఇప్పుడు చింత చిగురు వేసి పచ్చి  వాసన  పోయాక కారం  , ఉప్పు , పసుపు వేసి బాగా కలపాలి .
4) పెసరు పప్పు వేసి , కొతిమీర పొడి ,పుదీనా  , ఒక గ్లాసు నీళ్ళు  వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి
5) ఇప్పుడు గరం మసాల , కొతిమీర వేసి, బాగా కలిపి  దించుకోవాలి .

తాలింపు :

ఒక చిన్న  గిన్నెలో నూనే  వేడి చేసి , ఆవాలు , మెంతులు ,జీలకర్ర ,పచ్చి  మిర్చి వేసి సగం వరకు మగ్గనివ్వాలి . కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని తాయారు చేసుకున్న పప్పు  పైన వేసుకుని వడ్డించుకోవాలి .

దీనిని  అన్నం , రొట్టెలతో తినవచ్చు 

Tuesday 3 July 2012

వంకాయ టమాట కూర

కావాల్సిన పదార్థాలు :




వంకాయలు - 500 గ్రాములు
టమాటాలు - 4 పెద్దవి
పచ్చి మిరపకాయలు  - 6 నుండి 10
పసుపు - కొద్దిగా
ఉప్పు  - రుచికి సరిపడా
నూనే  - 2 చెంచాలు
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లంవెల్లుల్లి  - అర చెంచా
జీలకర్ర - అర చెంచా
కొతిమీర పొడి - 1 చెంచా
మసాల - అర చెంచా
కొతిమీర - అర కప్పు

తయారీ  విధానం  :

1) మొదటగా పచ్చి మిరపకాయలు , టమాటాలు , ఉల్లిపాయలు  మంచి నీటితో కడిగి సన్నగా తరుముకోవాలి .

2) ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి  అర చెంచా ఉప్పు వేసి వంకాయలు పురుగులు లేకుండా చూస్తూ చిన్నగా తరుముతూ , ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి.

3) ఒక కడాయిలో నూనే  వేడి చేసి , జీలకర్ర  , మిర్చి , ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి వేసి బాగా కలిపి , వంకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి..

4) వంకాయలు సగం వరకు ఉడికిన తర్వాత పసుపు , టమాటాలు  , కొతిమీర పొడి , ఉప్పు వేసి కలుపుకోవాలి . (ఉప్పు చాలా జాగ్రతగా  చూసి వేసుకోవాలి ,  వంకాయలు ఉప్పు నీళ్ళలో  కడిగాము  కావున తక్కువగా వేసుకోవాలి  )

5) చివరగా మసాల , కొతిమీర ఆకులు  వేసి బాగా కలిపి , దించుకోవాలి..

అంతే ఎంతో రుచికరమైన  వంకాయ టమాట  కూర  తాయారు చేసుకున్నాం. దీనిని   అన్నంతో , చపాతీ , రోటితో  తింటే చాల రుచిగా ఉంటుంది .


For English Versionhttp://kmshomemadefood.blogspot.in/2012/07/egg-plant-with-tomato-recipe-brinjal.html

Wednesday 23 May 2012

పెసరుపప్పు టమాట కూర(bachelor food)

టమాట పెసరుపప్పు  కూర చాల శులభంగా చేయవచ్చు . ముఖ్యంగా హాస్టల్లో ఉండే వాళ్ళు , ఉద్యోగం చేసుకునే వారు కూడా దీనిని చేసుకోవచ్చు.


కావలిసిన పదార్థాలు :

పెసరు పప్పు - రెండు  కప్పులు
టమాటాలు -నాలుగు (దోరగా పండినవి)
కారం - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
ఆవాలు - పావు  చెంచా
జీలకర్ర - పావు చెంచా
నూనే - రెండు చెంచాలు
మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా
తరిగిన కొతిమీర - పావు కప్పు
కరివేపాకు - కొద్దిగా
అల్లంవెల్లుల్లి - అర చెంచా
పసుపు - కొద్దిగా(చిటికెడు)
తరిగిన ఉల్లిపాయ -ఒకటి

తయారుచేసే విధానం :

మొదటగా పప్పును మంచి నీటిలో కడిగి పది నిముషాలు నానబెట్టాలి . పప్పు నానేటప్పుడు ఉల్లిపాయలు , టమాటాలు తరగాలి. ఒక గిన్నె తీసుకుని నూనే వేడి చేసి , అందులో ఆవాలు . జీలకర్ర వేసుకోవాలి .అవి చిటపటలడగానే , తరిగిన ఉల్లిపాయలు , సగం ఉప్పు వేయాలి ఉల్లిపాయలు ముదురు గోధుమ రంగు రాగానే అల్లంవెల్లుల్లి వేయాలి   ఒక నిమిషం తర్వాత కరివేపాకు వేసి వెంటనే టమాట ముక్కలు వేసుకోవాలి
తరవాత కారం , పసుపు  వేసి అయిదు నిముషాలు సన్నటి మంట మిద ఉడుకనివ్వాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు వేసి రెండో సగం ఉప్పు, కొతిమీర పొడి  వేసుకోవాలి  మరో అయిదు నిమిషాల తరవాత  మసాల ,తరిగిన  కొతిమీర వేసి దించుకోవాలి . పలచగా కావాలంటే పప్పు వేశాక ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు


అంతే పుల్లటి ఎంతో రుచిఅకరమైన టమాట పప్పు తయారైంది . దీనిని అన్నం లో కానీ , చపాతీలలో , ఉప్మా లో తినవచ్చు .
English Version :
http://kmshomemadefood.blogspot.in/2012/05/tomato-moong-dal-fry-bachelor-food.html

Thursday 17 May 2012

బెండకాయ చింత పులుసు కూర

కావలసిన  పదార్థాలు:

బెండకాయలు - 500 గ్రాములు
తరిగిన ఉల్లిపాయ - ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక చెంచా
పచ్చి మిరపకాయలు - 2
పసుపు - చిటికెడు
కారం - 2 చెంచాలు
ఉప్పు  - రుచికి సరిపడా
కరివేపాకు - కొద్దిగా

కొతిమీర  -అర కప్పు
ధనియాలపొడి - పావు కప్పు
పుల్లటి చింత పండు- పావు కప్పు
నునే -  50 మి . లీ
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - ఒక చెంచా
మెంతులు  - పావు చెంచా (ఎక్కువ అయితే చేదుగా ఉంటాయి ),
మసాల - ఒక చెంచా
నువ్వుల పొడి -అర కప్పు (అవసరమైతే  వేసుకోవచ్చు )

తయారు చేసే విధానం :


మొదటగా బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి (కత్తిరించుకోవాలి).  ఇలా  చిన్న ముక్కలుగా చేసుకునేటప్పుడు  ప్రతి ముక్క ను జాగ్రత్తగా , పురుగులు లేకుండా చూసుకోవాలి . ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు , కొతిమీర , కరివేపాకు కూడా కడిగి చిన్నగా తురుము కోవాలి . అలాగే ఒక చిన్న గిన్నె లో చింత పండు తీసుకుని , ఒకసారి నీళ్ళలో కడిగి కప్పు నిండా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి .

ఇప్పుడు ఒక కడాయిలో నునే వేడి చేసి ముందుగా ఆవాలు, జీలకర్ర , మెంతులు వేసి అవి చిటపట లాడగానే అల్లంవెల్లుల్లి  ముద్ద,, ఉల్లిపాయ ముక్కలు , పచ్చి  మిర్చి వేసుకోవాలి .దాని పైన సగం వరకు ఉప్పు వేసి మాడిపోకుండా జాగ్రతగా కలుపుతూ ఉండాలి .

ఇదంతా బాగా వేగాక బెండకయముక్కలు  వేసి 5 నుండి 10 నిముషాలు సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల జిగట పదార్థం అంతా ఆవిరైపోతుంది . తర్వాత పసుపు ,కారం , నువ్వు పొడి , ధనియాలపొడి  , రెండో సగం ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి . ననబెట్టుకున్న చింత పండు నుండి రసం పిండుకుని  బెండకయాలలో పోయాలి. ఈ మిశ్రమాన్ని  5 నిమిషాల పాటు మరగానివ్వాలి . దానిపై మసాల , కొతిమీర, కరివేపాకు వేసి ఒక నిమిషం మూత  పెట్టి ఉంచి , తరవాత దించుకోవాలి .

అంతే ఎంతో రుచికరమైన పుల్లపుల్లని  బెండకాయ చింత పులుసు కూర తయారైంది ....:)
For English Version:
http://kmshomemadefood.blogspot.in/2012/05/lady-finger-curry-with-tamarind-juice.html

Tuesday 15 May 2012

గుత్తివంకాయ నువ్వుల కూర

కావలసిన పదార్థాలు :





వంకాయలు 500 గ్రాములు
నువ్వులు 200 గ్రాములు
పచ్చి మిరపకాయలు 5
ఎండు మిరపకాయలు 10
ఉప్పు సరిపడా
నునే 100 మి లి
ఉల్లిపాయలు 2
అల్లంవెల్లుల్లి 2 చెంచాలు
ధనియాలపొడి అర కప్పు
మసాల ఒక చెంచా
కొతిమీర ఒక కప్పు
కరివేపాకు కొద్దిగా
పసుపు చిటికెడు

తయారి విధానం:


మొదటగా ఒక పెనం తీసుకుని దాని లో నువ్వులు దోరగా వేయించుకోవాలి(మాడిపోకుండా జాగ్రత్త పడాలి ) ఇప్పుడు ఎండు మిరపకాయలు ,కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి .ఇప్పుడు అలా వేయించుకున్న నువ్వులు, ఎండు మిరపకాయలు , కరివేపాకు  రోటిలో వేసుకుని కచ్చాపక్కగా దంచుకోవాలి.

 ఒక గిన్నె తీసుకుని అందులో దంచుకున్న నువ్వు పొడి , సగం ఉప్పు , మూడు పాళ్ళు అల్లం వెల్లుల్లి ,మూడు పాళ్ళు ధనియాల పొడి ,పసుపు , కొద్దిగా మసాల వేసుకుని  కొద్దిగా నునే కూడా వేసుకుని బాగా కలిపి ముద్దలా తాయారు చేసుకోవాలి.

ఇప్పుడు వంకాయలు పురుగులు లేనివి , లేతగా ఉండేవి ఎంచుకొని శుభ్రంగా కడిగి,కాండం వైపు కాకుండా మరో వైపు సగం కంటే ఎక్కువగా నాలుగు పాయలు వచ్చేలా కోయాలి . వాటిని వెంట వెంటనే ఉప్పు నీటిలో వేయాలి లేక పోతే చెదుగా అవుతాయి .(పాయలు విడిపోకుండా చూసుకోవాలి )


ఒక్కొక్క వంకాయ తీసుకుని నీళ్ళు లేకుండా ఒక గుడ్డతో తుడిచి ఇందాక తాయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వంకాయ పాయల మధ్య అమర్చుకోవాలి . మిశ్రమం ఉడి పోకుండా సన్నటి దారం  కూడా కట్టుకోవచ్చు.

ఇప్పుడు ఒక లోతైన కడాయి తీసుకుని అందులో నునే కాచుకొని , అందులో  ఉల్లిపాయ ముక్కలు , అల్లం వెల్లుల్లి ,పచ్చి మిరపకాయ ముక్కలు , వేసుకొని ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .ఇప్పుడు తాయారు చేసుకున్న వంకాయలు వేసుకుని  సన్నని మంట మీద 5 నిముషాలు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మిగిలిన ఉప్పు , ధనియాల పొడి, కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి సన్నని మంట పైన 10 నిముషాలు ఉడికించుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బాగా కలిపి మల్లి మూత పెట్టాలి .తర్వాత కరివేపాకు , కొతిమీర తురుము , మసాల వేసుకుని రెండు నిమిషాల తర్వాత దించుకోవాలి



అంతే నోరూరించే ఎంతో రుచికరమైన  గుత్తివంకాయ నువ్వుల  కూర తయారైంది . స్నాక్స్ లాగా తినాలనుకునే వాళ్ళు   నీళ్ళు తక్కువగా వేసుకుని మాడిపోకుండా అన్ని వైపులా జాగ్రతగా ఉడికించుకోవాలి .


For English Version :