Tuesday, 15 May 2012

గుత్తివంకాయ నువ్వుల కూర

కావలసిన పదార్థాలు :





వంకాయలు 500 గ్రాములు
నువ్వులు 200 గ్రాములు
పచ్చి మిరపకాయలు 5
ఎండు మిరపకాయలు 10
ఉప్పు సరిపడా
నునే 100 మి లి
ఉల్లిపాయలు 2
అల్లంవెల్లుల్లి 2 చెంచాలు
ధనియాలపొడి అర కప్పు
మసాల ఒక చెంచా
కొతిమీర ఒక కప్పు
కరివేపాకు కొద్దిగా
పసుపు చిటికెడు

తయారి విధానం:


మొదటగా ఒక పెనం తీసుకుని దాని లో నువ్వులు దోరగా వేయించుకోవాలి(మాడిపోకుండా జాగ్రత్త పడాలి ) ఇప్పుడు ఎండు మిరపకాయలు ,కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి .ఇప్పుడు అలా వేయించుకున్న నువ్వులు, ఎండు మిరపకాయలు , కరివేపాకు  రోటిలో వేసుకుని కచ్చాపక్కగా దంచుకోవాలి.

 ఒక గిన్నె తీసుకుని అందులో దంచుకున్న నువ్వు పొడి , సగం ఉప్పు , మూడు పాళ్ళు అల్లం వెల్లుల్లి ,మూడు పాళ్ళు ధనియాల పొడి ,పసుపు , కొద్దిగా మసాల వేసుకుని  కొద్దిగా నునే కూడా వేసుకుని బాగా కలిపి ముద్దలా తాయారు చేసుకోవాలి.

ఇప్పుడు వంకాయలు పురుగులు లేనివి , లేతగా ఉండేవి ఎంచుకొని శుభ్రంగా కడిగి,కాండం వైపు కాకుండా మరో వైపు సగం కంటే ఎక్కువగా నాలుగు పాయలు వచ్చేలా కోయాలి . వాటిని వెంట వెంటనే ఉప్పు నీటిలో వేయాలి లేక పోతే చెదుగా అవుతాయి .(పాయలు విడిపోకుండా చూసుకోవాలి )


ఒక్కొక్క వంకాయ తీసుకుని నీళ్ళు లేకుండా ఒక గుడ్డతో తుడిచి ఇందాక తాయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వంకాయ పాయల మధ్య అమర్చుకోవాలి . మిశ్రమం ఉడి పోకుండా సన్నటి దారం  కూడా కట్టుకోవచ్చు.

ఇప్పుడు ఒక లోతైన కడాయి తీసుకుని అందులో నునే కాచుకొని , అందులో  ఉల్లిపాయ ముక్కలు , అల్లం వెల్లుల్లి ,పచ్చి మిరపకాయ ముక్కలు , వేసుకొని ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .ఇప్పుడు తాయారు చేసుకున్న వంకాయలు వేసుకుని  సన్నని మంట మీద 5 నిముషాలు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మిగిలిన ఉప్పు , ధనియాల పొడి, కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి సన్నని మంట పైన 10 నిముషాలు ఉడికించుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బాగా కలిపి మల్లి మూత పెట్టాలి .తర్వాత కరివేపాకు , కొతిమీర తురుము , మసాల వేసుకుని రెండు నిమిషాల తర్వాత దించుకోవాలి



అంతే నోరూరించే ఎంతో రుచికరమైన  గుత్తివంకాయ నువ్వుల  కూర తయారైంది . స్నాక్స్ లాగా తినాలనుకునే వాళ్ళు   నీళ్ళు తక్కువగా వేసుకుని మాడిపోకుండా అన్ని వైపులా జాగ్రతగా ఉడికించుకోవాలి .


For English Version :           

No comments:

Post a Comment