కావలసిన పదార్థాలు:
బెండకాయలు - 500 గ్రాములు
తరిగిన ఉల్లిపాయ - ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక చెంచా
పచ్చి మిరపకాయలు - 2
పసుపు - చిటికెడు
కారం - 2 చెంచాలు
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - కొద్దిగా
కొతిమీర -అర కప్పు
ధనియాలపొడి - పావు కప్పు
పుల్లటి చింత పండు- పావు కప్పు
నునే - 50 మి . లీ
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - ఒక చెంచా
మెంతులు - పావు చెంచా (ఎక్కువ అయితే చేదుగా ఉంటాయి ),
మసాల - ఒక చెంచా
నువ్వుల పొడి -అర కప్పు (అవసరమైతే వేసుకోవచ్చు )
తయారు చేసే విధానం :
మొదటగా బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి (కత్తిరించుకోవాలి). ఇలా చిన్న ముక్కలుగా చేసుకునేటప్పుడు ప్రతి ముక్క ను జాగ్రత్తగా , పురుగులు లేకుండా చూసుకోవాలి . ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు , కొతిమీర , కరివేపాకు కూడా కడిగి చిన్నగా తురుము కోవాలి . అలాగే ఒక చిన్న గిన్నె లో చింత పండు తీసుకుని , ఒకసారి నీళ్ళలో కడిగి కప్పు నిండా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి .
ఇప్పుడు ఒక కడాయిలో నునే వేడి చేసి ముందుగా ఆవాలు, జీలకర్ర , మెంతులు వేసి అవి చిటపట లాడగానే అల్లంవెల్లుల్లి ముద్ద,, ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి వేసుకోవాలి .దాని పైన సగం వరకు ఉప్పు వేసి మాడిపోకుండా జాగ్రతగా కలుపుతూ ఉండాలి .
ఇదంతా బాగా వేగాక బెండకయముక్కలు వేసి 5 నుండి 10 నిముషాలు సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల జిగట పదార్థం అంతా ఆవిరైపోతుంది . తర్వాత పసుపు ,కారం , నువ్వు పొడి , ధనియాలపొడి , రెండో సగం ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి . ననబెట్టుకున్న చింత పండు నుండి రసం పిండుకుని బెండకయాలలో పోయాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు మరగానివ్వాలి . దానిపై మసాల , కొతిమీర, కరివేపాకు వేసి ఒక నిమిషం మూత పెట్టి ఉంచి , తరవాత దించుకోవాలి .
అంతే ఎంతో రుచికరమైన పుల్లపుల్లని బెండకాయ చింత పులుసు కూర తయారైంది ....:)
For English Version:
http://kmshomemadefood.blogspot.in/2012/05/lady-finger-curry-with-tamarind-juice.html

No comments:
Post a Comment