Wednesday 9 May 2012

తోటకూర పప్పు



పోషక విలువలు :
ప్రతి 100  గ్రాములో
పొటాషియం 641 మి గ్రా
కాల్షియం 209 మి గ్రా
పాస్పరస్ 72 మి గ్రా
మెగ్నీషియం 55   మి గ్రా
 సోడియం 21   మి గ్రా
ఇనుము  2.3 మి గ్రా
ఇంకా జింక్ , కాపర్ ,మాంగనీస్ , ఫ్లోరిన్  కొద్ది మోత్డులలో ఉంటాయి

విటమిన్లు:

ప్రధానంగా  విటమిన్   A, C , B6 ,  ఫోలేట్ , నియాసిన్ , థయామిన్  కూడా ఉంటాయి
 ప్రోటీన్లు , అమినో ఆమ్లాలు  2.1 గ్రా ;

 ఉపయోగాలు :

మంచి విరోచానాకరి ,జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ,ఆకలిని పుట్టిస్తుంది, రక్తహీనతకు మంచి విరుగుడు , ఎముకలు బలంగా చేస్తుంది , కాలేయ సంబందిత రోగాలకు కూడా పని చేస్తుంది , గుండె జబ్బు వాళ్ళకు మంచి సహాయకారి , వారానికి రెండు సార్లు తినేవారికి  మలబద్దకం దరి చేరదు.

కావాల్సిన పదార్థాలు :




తోటకూర 2 కట్టలు (500 గ్రాములు)
పెసరు పప్పు 100 గ్రాములు
నూనే 50 మి లీ
పచ్చిమిరపకాయలు ౮
అల్లంవెల్లుల్లి 50 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు 2 చిన్నవి
జీలకర్ర ఒక చెంచా
ఆవాలు కొన్ని
మెంతులు 10
ధనియాల పొడి 2 చెంచాలు
కారం ఒక చెంచా
ఉప్పు రుచికి సరిపడా
మసాల ఒక చెంచా

తయారు చేసే విధానం :


మొదటగా పెసరు పప్పును శుబ్రంగా కడిగి 10 నిముషాలు నానబెట్టాలి. ఇప్పుడు పురుగులు లేకుండా చూసుకుని  మంచి నీటిలో కడిగి సన్నగా తురుము కోవాలి . మిరపకయాలలో కొద్దిగా ఉప్పు వేసి రోటిలో కచ్చా పక్కాగా  దంచుకోవాలి .
స్టవ్ వెలిగించి ఒక గిన్నె లో నూనే పోసి వేడిచేసుకోవాలి , నూనే వేడి అయ్యాక ఆవాలు , మెంతులు , జీలకర్ర వేసి  కొద్ది సేపట్లోనే తరిగిన ఉల్లిపాయలు , అల్లంవెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాల పాటు సన్నని మంట ఫై వేగనివ్వాలి. ఇప్పుడు సగం ఉప్పు , కారం వేసి పూర్తిగా కలియబెట్టి సన్నగా తిమిన ఆకులూ వేసుకొని , మూత  పెట్టి  రెండు నిముషాలు మగ్గనివ్వాలి . ఇప్పుడు  దంచిపెట్టుకున్న పచ్చి కారం , మరో సగం ఉప్పు ,ధనియాల పొడి వేసి పెసరు పప్పు వేసుకోవాలి . అంత బాగా కలిపి ఇంకో అయిదు నిమిహాలు ఉడికించుకొని , దించి మసాల వేయాలి .
అంతే ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన  తోటకూర పప్పు తయారైనది.
దీనిని అన్నం లో కానీ , చపతిలలో కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది
 English version :http://kmshomemadefood.blogspot.in/2012/05/amaranth-leaves-and-moong-dal-fry.html

No comments:

Post a Comment