Tuesday 8 May 2012

మామిడికాయ పానకం

మామిడికాయలు ఎండాకాలంలో దొరికే ఒక అత్యద్బుతమైన ఫలాలు ,  ఇది దేవుడు సృష్టించిన అత్యద్భుతాలలో ఒకటి. మండే వేసవిలో దొరికే ఆపన్నహస్తం మామిడి పండ్లు , వాటిన రసాలు . మన దేశం లో మామిడి పండును పండ్ల రారాజు  అంటారు

ఉపయోగాలు :
మామిడికాయ బెరడు మరియు టెంక  లోపలి జీడి ని  ఔషధాలలోను ఉపయోగిస్తున్నారు .

పోషక విలువలు :


ప్రతి 100 గ్రాములలో
కాల్సియం  14 మి.గ్రా
ప్రోటీన్లు 0.6 శాతం
పిండి పదార్థాలు 16.9 శాతం
ఇనుము 1.3 మి గ్రా
విటమిన్  సి

బాగా పండిన పండ్లలో  చక్కర శాతం కూడా ఎక్కువే . కానీ పచ్చిగా ఉండే కాయలలో మాత్రం  విటమిన్ సి ఎక్కువ అన్నిటికంటే గొప్ప విషయం ఇది  లావేక్కడానికి సహాయ పడుతుంది. మిమిదికాయ ముక్కలకు ఉప్పు చేర్చి తినడం వల్ల  చెమట వలన వచ్చే అలసట తగ్గుతుంది . రోజు ఒక మిమిది పండు తిని గ్లాసు పలు తాగితే బరువు కూడా పెరుగుతారు . ఇవి జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగేల చేస్తాయి , సన్నగా ఉండే వారికీ ఎంతో ఉపయోగకరం. ఇందులో విటమిన్ ఎ  కూడా ఉంటుంది దేని వలన కంటి చూపు మండగించకుండా ఉంటుంది ..
ఇన్ని ఔషద గుణాలున్న ఫలాలను మనం కచ్చితంగా తిని తీరలి ...:)

మామిడికాయ పానకం :

కావాల్సిన పదార్థాలు :


మామిడికాయలు  500 గ్రాములు
చిక్కటి పాలు 100 మి లీ
యాలకులు 5
చెక్కర 100 గ్రాములు
నీళ్ళు ఒక గ్లాసు
పచ్చి కొబ్బరి తురుము  100 గ్రాములు


 పానకం తాయారు చేసే విధానం :


 మొదటగా అప్పుడే తీసిన చిక్కటి పాలలో కొన్ని నీళ్ళు (రెండు పాళ్ళ పాలకు ఒక  వంతు నీళ్ళు ) పోసుకుని చెక్కర వేసుకొని 15 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఇలా చేయడం వాళ్ళ పాల పచ్చి  వాసన పోతుంది . ఇప్పుడు బాగా పండిన మామిడికాయలను శుబ్రంగా కడిగి తొక్క  తీసి రసం పిండుకోవాలి . ఒక కొబ్బరి తీసుకుని చాల సన్నగా తురుమువుకోవాలి . అలాగే యాలకులు కూడా నలగోట్టుకోవాలి  ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోని దానిలో మామిడి పండ్ల రసం , కొబ్బరి , కాచిన పాలు ,  యాలకుల పొడి , నీళ్ళు (కొబ్బరి నీళ్ళు కూడా వాడుకోవచ్చు)  వేసుకొని బాగా కలియబెట్టాలి .

 ఏంతో రుచికరమైన  మామిడికాయ పానకం తయారైంది .

దీనిని  పూరీలతో గాని , చపాతిలతో  గాని వెన్నేలో కాల్చుకున్న బ్రెడ్ తో గని తింటే ఎంతో రుచికరం గా ఉంటుంది .
 సాయంత్రం చేస్తే పల్లాలు ఎంతో ఇష్టంగా తింటారు . అంటే కాకుండా ఎన్నో పోశాక విలువలు ఉన్నాయ్ కాబట్టి  ఆరోగ్యానికి కూడా మంచిది ...
   for english version 
http://kmshomemadefood.blogspot.in/2012/05/mango-special-juice.html

1 comment: